Sundari Ni Divya Rupamunu
Ragam: Kalyani
Talam: Adi
Composer: Sri Tyagaraju
సుందరి నీ దివ్యరూపమును జూడ తనకు దొరికెనమ్మా
మందగమన నీదు కటాక్ష బలమో ముందటిపూజాఫలమో త్రిపుర సుందరి నీ దివ్య||
కలిలో దీన రక్షకియని సభగలిగినతావున పొగడుదునమ్మ
సలలిత గుణ కరుణాసాగరి నీ సాటి ఎవ్వరమ్మా?
అలసివచ్చినందుకు నా మనసుహాయిచెందునాయని యుండగ మరి
కలకలమను సురసతులు వరుసగా కొలువు శుక్రవారపు ముద్దు త్రిపుర సుందరి||
నన్నుగన్నతల్లి నాజన్మము నేడు సఫలమాయెనమ్మా
ఘనదరిద్రునికి పైకమువలె నా (మా) కనుల పండువుగా
వనజనయన వినుము ఎండుపైరులకు జలమువలె శుభదాయకి
కామజనకుని సోదరి శ్రీ త్యాగరాజ మనోహరి గౌరీ త్రిపుర సుందరి||

No comments:
Post a Comment