నరులాల నేడువో నారసింహ జయంతి సురలకు ఆనందమై శుభములొసగెను!
సంధించి వైశాఖ శుద్ధ చతుర్దశి శనివారమందు సంధ్యాకాలమున ఔభలేశుడు
పొందుగా కంభములొ పొడమి గడపమీద కందువ గోళ్ళ చించె కనక కశిపుని || నరులాల ||
నరమృగ రూపము నానా హస్తముల అరిది శంఖ చక్రాది ఆయుధాలతో
గరిమ ప్రహ్లాదుని కాచి రక్షించి నిలిచె గురుతర బ్రహ్మాండ గుహలోనను || నరులాల ||
కాంచనపు గద్దె మీద దగ్గన కొలువై యుండి మించుగ ఇందిర తొడమీద బెట్టుక
అంత్య శ్రీ వెంకటగిరి ఆదిమపురుషుండై వంచనసేయక మంచి వరాలిచ్చేనిదివో || నరులాల ||
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment