Saturday, July 11, 2015

Brahmai Vaham Kila (No Earthly Connection)
Kirthana by Sri Sadasiva Brahmendra

బ్రహ్మై వాహం కిల సద్గురు కృపయా
బ్రహ్మై వాహం కిల గురు కృపయా చిన్మయ బోధానంద ఘనం తత్
శృత్యంతైక నిరూపితం అతులం సత్య సుఖాంబుధి సమరసం అనఘం
కర్మాకర్మ వికర్మ విదూరం నిర్మల సంవిద ఖండమపారం
నిరవధి సత్తాస్పద పదమజరం నిరుపమ మహిమని నిహితమనీహం
ఆశా పాశ వినాశన చతురం కోశ పంచకాతీతం అనంతం
కారణ కారణమేకం అనేకం కాలకాల కలితోశ విహీనం
అప్రమేయ పదం అఖిలాధారం నిష్ప్రపంచ నిజ నిష్క్రియ రూపం
స్వప్రకాశ శివ మధ్వయ అభయం నిష్ప్రతర్క్య మన పాయమకాయం



Meaning:
సద్గురువు చేసిన ఆనందకరమైన మనోబోధనల వలన, దయ వలన, నా మనసులో బ్రహ్మం గోచరించింది. చాలా సుఖమైనది, నిర్మలమైనది, ఆశలను, పాశాలను నిర్మూలించేది, స్వయంప్రకాశమైనది, అఖిలాధారమయినది అయిన బ్రహ్మము!
Sri Sadashiva Brahmendra is a yogi who had realized the "Brahmam" or the Infinite Spirit (God) in his meditation. His songs are sweet and this one resonates with the authenticity of his experience with the Infinite. In this song, he says that thanks to the teachings and blessings of his Guru, he was able to realize Brahmam. The rest of the song seems to be a description of this experience with God, it gives bliss, removes the effects of karma, is pure and whole, removes desire and earthly connections.

సంస్కృతము, తెలుగు, తమిళ భాషలలొ పండితులు, మా తెలుగు ఉపాధ్యాయులు, పూజ్య గురువుగారు అయిన శ్రీ ప్రతివాద భయంకర అణ్ణంజ్ఞరాచార్యులవారు (హైదరాబాదు) ఈ పాటకు చెప్పిన భావార్థము:
నేను బ్రహ్మని కాను. కాని సద్గురువు యొక్క కృప వలన బ్రహ్మనే. ఆ బ్రహ్మ స్వరూపము చిన్మయ బోధవలన ఆనందస్వరూపమై శ్రేష్ఠమైనది, సత్యస్వరూపమైనది, అసమానమైనది. సత్యమనెడి సుఖసముద్రముతో సమానమైనది. పాపరహితమైనది. కర్మాకర్మలకు దూరమైనది. నిర్మలమైన జ్ఞానఖండమై పారము లేనిది. "సత్"తునకు స్థానమై చరములేనిది. ఉపమానము లేని మహిమతో కూడినది. ఊహించతరము కానిది, అశాపాశములను పోగొట్టగలది. అయిదు కోశములకు అతీతమైనది. అనంతమై కారణాకారణమొకటై, కాలాకాల కలి ప్రభావమునకు లోనుకానిది. కొలవరాని స్థానము. సమస్త ఆకారములకది స్వకీయమైన రూపముకలది. స్వయముగా ప్రకాశించుచు మంగళకరమై అభయమునిచ్చుచు, నాశరహితమైన శరీరము ఆ బ్రహ్మ స్వరూపము.